: కొత్త స్పైడర్ మ్యాన్ వచ్చేశాడు... 19 ఏళ్ల యువకుడికి దక్కిన హీరో చాన్స్


ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన స్పైడర్ మ్యాన్ సిరీస్ లో మరో చిత్రం రానుంది. సోనీ పిక్చర్స్, మార్వెల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్పైడర్ మ్యాన్, పీటర్ పార్కర్ పాత్ర కోసం 19 సంవత్సరాల బ్రిటీష్ నటుడు టామ్ హోలాండ్ ను ఎంచుకున్నారు. జాన్ వాట్స్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం జూలై 29, 2017లో విడుదల కానుంది. "హీరో పాత్ర కోసం ఎందరో యువ నటులను పరిశీలించాం. కానీ, టామ్ స్క్రీన్ టెస్టు ప్రత్యేకం. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది" అని సోనీ పిక్చర్స్ చైర్మన్ రోత్ మన్ వివరించారు. కాగా, 2012లో విడుదలైన సునామీ డ్రామా 'ది ఇంపాజిబుల్'లో టామ్ హోలాండ్ కీలక పాత్ర పోషించాడు. త్వరలో రానున్న 'సివిల్ వార్' చిత్రంలోనూ నటించాడు. కొత్త స్పైడర్ మ్యాన్ చిత్రం పీటర్ పార్కర్ విద్యాభ్యాసం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News