: కేసీఆర్ ఏడ్చి మొత్తుకున్నా...సెక్షన్ 8 అమలు ఆగదు: మాజీ మంత్రి టీజీ వెంకటేశ్
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వివాదాల నేపథ్యంలో తెరపైకి వచ్చిన సెక్షన్ 8 అమలు ఆగదని టీడీపీ నేత, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్... ఏడ్చినా, కేకలు పెట్టినా, చివరకు పదవీ త్యాగం చేసినా ఫలితం లేదని ఆయన నిన్న వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన సెక్షన్ 8 అమలుకు నిరసనగా కేసీఆర్ దీక్షలు చేసినా ఏం కాదని కూడా తేల్చిచెప్పారు. ఉమ్మడి రాష్ట్రాల రాజధానిగా ఉన్న హైదరాబాదులో శాంతిభద్రతలపై గవర్నర్ జోక్యం ఎప్పుడూ ఉండాల్సిందేనని టీజీ డిమాండ్ చేశారు.