: తెలంగాణలో 2, ఆంధ్రప్రదేశ్ లో 3 స్మార్ట్ నగరాలు
100 స్మార్ట్ సిటీల ప్రాజెక్టులో తెలుగు రాష్ట్రాలకు నామమాత్రపు ఊరటే లభించింది. తొలి దశ స్మార్ట్ సిటీల్లో భాగంగా అభివృద్ధి నిమిత్తం ఎంపిక చేసిన నగరాల్లో ఆంధ్రప్రదేశ్ కు 3, తెలంగాణలో 2 పేర్లు మాత్రమే కనిపించాయి. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ లోని 13, తమిళనాడులోని 12, మహారాష్ట్రలోని 10 నగరాలకు స్థానం లభించింది. వంద ఆకర్షణీయ నగరాలు, 500ల 'అమృత్'నగరాలు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 25న స్వయంగా వెల్లడించనున్నారు. కాగా, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు సూచించిన నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే విశాఖపట్నం స్మార్ట్ సిటీ జాబితాలో స్థానం సంపాదించగా, మిగతా రెండు నగరాల పేర్లను బాబు సర్కారు వెల్లడించాల్సి వుంది.