: ప్రత్యర్థులకు దిమ్మతిరిగేలా మెజారిటీ ఇవ్వండి...ఆర్కే నగర్ ఓటర్లకు ‘అమ్మ’ పిలుపు


అక్రమాస్తుల కేసు నుంచి బయటపడి ఎన్నికల బరిలో నిలిచిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిన్న, మొన్న ప్రచారంలో పాల్గొన్నారు. కేబినెట్ మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు వెంటరాగా ఆమె తాను పోటీలో ఉన్న ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను విజయం కోసం రాలేదని, దిగ్విజయం కోసం వచ్చానని ఓటర్లకు చెప్పారు. అన్నాడీఎంకే ప్రత్యర్థులకు దిమ్మతిరిగే మెజారిటీతో తనను గెలిపించాలని ఆమె ఆర్కే నగర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. అంతేకాక వచ్చే ఏడాది తమిళ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయానికి నాందిగా ఈ ఎన్నికను పరిగణించాలని కూడా ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News