: ఆ ‘వాయిస్’ నమూనాలను ఇప్పించండి... ఏసీబీ కోర్టుకు ‘ఫోరెన్సిక్’ అభ్యర్థన


ఓటుకు నోటు కేసులో తమకు అందించిన ఆడియో, వీడియోల వాస్తవికతను నిర్ధారించేందుకు రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరి (ఎఫ్ఎస్ఎల్) నిన్న ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. సదరు ఆడియో, వీడియో టేపుల్లోని స్వరాల గొంతులను గుర్తించేందుకు వీలుగా సంబంధిత వ్యక్తుల వాయిస్ నమూనాలను ఇప్పించాలని సదరు మెమోలో ఎఫ్ఎస్ఎల్ కోరింది. ఈ మేరకు దర్యాప్తు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఆ సంస్థ తన మెమోలో కోర్టును అభ్యర్థించింది.

  • Loading...

More Telugu News