: సుధీర్ కు బాసటగా నిలిచిన టీమిండియా క్రికెటర్లు


మిర్పూర్ లో రెండో వన్డే ముగిసిన అనంతరం బంగ్లాదేశ్ ఫ్యాన్స్ టీమిండియా వీరాభిమాని, సచిన్ భక్తుడు అయిన సుధీర్ గౌతమ్ పై దాడికి యత్నించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, మూడో వన్డేకు అతడికి పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. కాగా, తాము ఎక్కడ మ్యాచ్ ఆడేందుకు వెళ్లినా, తమ వెన్నంటే వచ్చే సుధీర్ కు టీమిండియా క్రికెటర్లు బాసటగా నిలిచారు. సుధీరే ఈ విషయం చెప్పాడు. ఏ సమస్య వచ్చినా తనకు చెప్పాలని కోహ్లీ పేర్కొన్నాడని వివరించాడు. అసలేం జరిగిందన్న విషయం అడిగి తెలుసుకున్నాడని తెలిపాడు. ఎలాంటి సాయమైనా చేస్తానని కోహ్లీ హామీ ఇచ్చాడని సుధీర్ చెప్పాడు. ఇక, సురేశ్ రైనా, అశ్విన్ కూడా సుధీర్ ను కలిసి అతడిని ఉత్సాహపరిచారు. జట్టు మేనేజర్ బిశ్వరూప్ ఇప్పటికే తన ఫోన్ నెంబర్ ఇచ్చాడని, ఏదైనా సమస్య వస్తే ఫోన్ చేయమని కోరాడని ఈ సూపర్ ఫ్యాన్ తెలిపాడు.

  • Loading...

More Telugu News