: రేవంత్ కు బెయిల్ ఇవ్వవద్దు: కోర్టుకు కౌంటర్ దాఖలు చేసిన ఏసీబీ
ఓటుకు నోటు కేసులో అరెస్టైన తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానంలో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయవద్దని ఏసీబీ న్యాయస్థానాన్ని కోరింది. నోటుకు ఓటు కేసులో విచారణ జరుగుతోందని, పరారీలో ఉన్న మత్తయ్య, సండ్ర వీరయ్య, మరి కొంత మంది సాక్షులను విచారించాల్సి ఉందని న్యాయస్థానానికి ఏసీబీ వివరించింది. ఈ కేసులో మరిన్ని సాక్ష్యాలు సేకరించాల్సి ఉన్నందున, రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడం సరికాదని, బెయిల్ మంజూరు చేస్తే ఇవన్నీ తారుమారయ్యే ప్రమాదం ఉందని ఏసీబీ కౌంటర్ లో పేర్కొంది. కాగా, రేపు విచారణలో ఏసీబీ తరపున తెలంగాణ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించనున్నారు.