: ఢిల్లీ రంజీ జట్టు నుంచి తప్పుకోనున్న సెహ్వాగ్


టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సొంత జట్టు నుంచి తప్పుకోనున్నాడు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సెహ్వాగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో సెహ్వాగ్ ఇతర రంజీ జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. గత సీజన్లో ఢిల్లీ రంజీ జట్టు టాప్ స్కోరర్ సెహ్వాగ్ కావడం విశేషం. 2014-15 సీజన్ లో ఢిల్లీ 8 రంజీ మ్యాచ్ లు ఆడగా 51.68 సగటుతో, రెండు సెంచరీల సాయంతో సెహ్వాగ్ మొత్తం 568 పరుగులు సాధించాడు. కాగా, ఢిల్లీ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వార్తలపై సెహ్వాగ్ స్పందించకపోవడం విశేషం. ఐపీఎల్ లో పంజాబ్ జట్టుకు ఆడిన సెహ్వాగ్ ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో ఆయన ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News