: హైదరాబాదు 'నా అయ్య జాగీరు' అంటే కుదరదు: ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల
హైదరాబాదు నా అయ్య జాగీరు అని ఎవరైనా అంటే కుదరదని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. సెక్షన్ 8 అమలుపై హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు హైదరాబాదు ఎవరి జాగీరు కాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులోని సెక్షన్ 5, 8 లలో ఉమ్మడి రాజధాని, రాజధానిలో గవర్నర్ అధికారాలపై స్పష్టంగా చెప్పారని ఆయన తెలిపారు. వాటిని తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని ఆయన సూచించారు. ముందు విభజన బిల్లుపై అవగాహన పెంచుకోవాలని ఆయన తెలిపారు. హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.