: రూ.27వేల దిగువకు చేరిన బంగారం ధర
దేశంలో బంగారం ధరలు రూ.27వేల దిగువకు చేరాయి. ఈ రోజు రూ.50లు తగ్గిన పసిడి ధర రెండు వారాల కనిష్ఠానికి చేరింది. దాంతో 10 గ్రాముల బంగారం ధర బులియన్ మార్కెట్ లో రూ.26,950 పలుకుతోంది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో బంగారం ధరలు తగ్గాయని అంటున్నారు. ఇక వెండి ధర రూ.100 పెరిగింది. ఈ క్రమంలో కేజీ వెండి ధర రూ.36,950 పలుకుతోంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఏర్పడటంతో వెండి ధరలు పెరిగాయని బులియన్ వర్గాలు తెలిపాయి.