: బీపీ తగ్గడానికి 'శాస్త్రీయ' మార్గం!


సంగీతానికి ఎంతో శక్తి ఉందని అంటుంటారు. ముఖ్యంగా, శాస్త్రీయ సంగీతం వ్యాధులను నయం చేయడంలో ఉపకరిస్తుందన్నది కొందరి నమ్మకం. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు కూడా అదే మాట అంటున్నారు. శాస్త్రీయ సంగీతం రక్తపోటును తగ్గిస్తుందని, తద్వారా హృదయ స్పందన సాఫీగా సాగేందుకు తోడ్పడుతుందని తెలిపారు. సంగీతాన్ని వివిధ టెంపోల్లో వినిపించినప్పుడు నాడీ స్పందన పైనా, రక్తపోటు పైనా ఆ ప్రభావం తప్పక కనిపిస్తుందని గుర్తించారు. శాస్త్రీయ సంగీతం వినిపించినప్పుడు వ్యక్తుల సహజ లయ సాధారణంగానే ఉందని, అదే ర్యాప్, పాప్ సంగీతం వినిపించగా బీపీలో పెరుగుదల కనిపించిందని పరిశోధనలో పాలుపంచుకున్న ప్రొఫెసర్ పీటర్ స్లీట్ తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ లో ఈ వివరాలు పొందుపరిచారు.

  • Loading...

More Telugu News