: అత్తగారే తనకు ప్రేరణ అంటున్న కరీనా
బాలీవుడ్ అందాలతార కరీనా కపూర్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అత్తగారు షర్మిలా ఠాగూర్ తనకు ప్రేరణ అని తెలిపింది. ఆమె తనను గ్లామర్ పాత్రల్లో చూడాలనుకుంటున్నారని తెలిపింది. దబాంగ్ 2లోని 'ఫెవికాల్' సాంగ్ అన్నా, ఆ పాటలో డ్యాన్సన్నా ఆమెకెంతో ఇష్టమని వివరించింది. "నేను గ్లామరస్ గా, సెక్సీగా ఉంటానని ఆమె ఎప్పుడూ అంటుంటారు. ఆవిడ కాంప్లిమెంట్ ను ఇష్టపడుతున్నాను. ఓ విధంగా చెప్పాలంటే ఆమే నాకు ప్రేరణ. మా అత్తగారు పెళ్లయి, పిల్లలు పుట్టిన తర్వాత కూడా నటించారు. పెద్ద స్టార్లు, బడా నిర్మాతలతో పనిచేశారు. కెరీర్, ఫ్యామిలీ ప్రాధాన్యత నేపథ్యంలో ఆమెనే అనుసరిస్తాను" అని చెప్పుకొచ్చింది. కరీనా తనకంటే వయసులో ఎంతో పెద్దవాడైన హీరో సైఫ్ అలీఖాన్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.