: రూ. 799లకే ఎయిర్ ఆసియా విమాన టికెట్
విమాన టికెట్ల ధరల పోటీని మరింతగా పెంచుతూ, లోకాస్ట్ ఎయిర్ లైన్ సేవల సంస్థ ఎయిర్ ఆసియా రూ. 799లకే విమాన టికెట్లను అందిస్తామని ప్రటించింది. ఈ నెల 28లోగా టికెట్లను బుక్ చేసుకోవాలని, 'బిగ్ సేల్' ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 15 నుంచి జూన్ 28 వరకూ ఈ టికెట్లు చెల్లుబాటవుతాయని సంస్థ వివరించింది. బెంగళూరు-కొచ్చి ఫేర్ రూ.799 నుంచి మొదలవుతుందని, బెంగళూరు నుంచి జైపూరుకు రూ. 1,599, న్యూఢిల్లీకి రూ. 1,999 రూపాయల ధరలో టికెట్లు లభిస్తాయని తెలిపింది.