: 'సెక్షన్ 8'పై మేం ఏం చెబుతున్నామో అటార్నీ జనరల్ కూడా అదే చెప్పారు: ఏపీ హోంమంత్రి చినరాజప్ప
సెక్షన్ 8 అమలుపై తాము ఏం చెబుతున్నామో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కూడా అదే చెప్పారని ఏపీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ఇకనైనా గవర్నర్ చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో మీడియాతో మంత్రి ఈ మేరకు మాట్లాడారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతుందని, సరైన సమయంలో అన్ని ఆధారాలు బయటికి వస్తాయని రాజప్ప అన్నారు. ప్రజలు మంచి పరిపాలన కోరుకుంటున్నారన్న సంగతి సీఎం కేసీఆర్ గ్రహించాలని ఆయన సూచించారు.