: మీ సీఎంకు, మంత్రులకు మీరే భద్రత కల్పించుకోండి... టీ పోలీస్ లేఖను బయటపెట్టిన ఏపీ పోలీస్


హైదరాబాదులో ఏపీ పోలీసుల ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ పోలీసులు.. బయటికొకమాట, లోపల మరో మాట మాట్లాడుతున్నారట. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో శాంతిభద్రతల పరిరక్షణ తమ పరిధిలోనిదేనని తెలంగాణ డీజీపీ బహిరంగంగా ప్రకటిస్తున్నా, ఆ రాష్ట్ర పోలీసు శాఖ మాత్రం ఆయనకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ‘‘హైదరాబాదులో మీ భద్రత కోసం మీ బలగాలను వినియోగించుకోండి’’ అంటూ టీ పోలీసు శాఖ లేఖ నేపథ్యంలోనే హైదరాబాదులో ఏపీ పోలీసు బలగాలు కాలు మోపాయట. ఈ మేరకు ఏపీఎస్పీ డీజీ గౌతమ్ సవాంగ్ నిన్న తెలంగాణ పోలీసు శాఖ జారీ చేసిన అధికారిక లేఖను ఏపీ డీజీపీ జేవీ రాముడి ముందు పెట్టారు. నిన్న జరిగిన భేటీలో హైదరాబాదులో ఏపీ పోలీసు బలగాల మోహరింపుపై జరిగిన చర్చలో గౌతమ్ సవాంగ్ పలు కీలక అంశాలను వెల్లడించారు. అసలు తెలంగాణ పోలీసుల సూచన మేరకే హైదరాబాదులో ఏపీ బలగాలను మోహరించాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ అభ్యర్థన మేరకే 44 ప్లటూన్ల బలగాలను హైదరాబాదుకు తరలించామని చెప్పిన సవాంగ్, ఆ తర్వాత బలగాల ఉపసంహరణకు సిద్ధంగా కాగా, ‘‘హైదరాబాదులో మీ సీఎం, మంత్రులకు మీరే భద్రత కల్పించుకోండి’’ అంటూ తెలంగాణ పోలీసు శాఖ నుంచి ఓ లేఖ జారీ అయిందని చెప్పారు. దీంతో కేవలం 20 ప్లటూన్ల బలగాలను ఉపసంహరించిన సవాంగ్, మిగిలిన 24 ప్లటూన్లను హైదరాబాదులోనే ఉంచారు.

  • Loading...

More Telugu News