: కాంగ్రెస్ ను వీడను...పార్టీ విజయం కోసం రెండు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తా: జయసుధ ప్రకటన


కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని టాలీవుడ్ ప్రముఖ నటి, సికింద్రాబాదు మాజీ ఎమ్మెల్యే జయసుధ ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆమె భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తారన్న వార్తలను చూసి తానే విస్మయానికి గురయ్యానని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ విజయం కోసం శ్రమిస్తానని, రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రచారంలో పాలుపంచుకుంటానని ఆమె స్పష్టం చేశారు. జయసుధ కాంగ్రెస్ లోనే కొనసాగుతారని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు చెప్పారు.

  • Loading...

More Telugu News