: బహిరంగ సభలో మమతా బెనర్జీ మేనల్లుడి హెచ్చరిక వ్యాఖ్యలు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ప్రయోజనాలను దెబ్బతీయాలని ఎవరైనా ప్రయత్నిస్తే "కళ్లు పీకేస్తాం, చేతులు నరికేస్తాం" అంటూ బహిరంగంగా బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి ఎంపీ అయిన అభిషేక్... కోల్ కతాలోని నార్త్ 24 పరగణ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగసభలో 30 నిమిషాల పాటు ప్రసంగించారు. "మమ్మల్ని ఎవరైనా ఎదిరిస్తే వారి కళ్లు పీకేసి రోడ్డు మీదకు ఈడుస్తాం. మా వైపు చేతులు చూపిస్తే వాటిని నరికేస్తాం" అని పలువురు పార్టీ సీనియర్లు పాల్గొన్న ఆ సభలో అభిషేక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ యూత్ వింగ్ కు అధినేతగా ఉన్న 27 ఏళ్ల అభిషేక్ ను గతేడాది ఓ యువకుడు చెంపదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే.