: 800 ఏళ్ల కఠిన నిబంధన మారేలా చేసిన ట్రాన్స్ జెండర్
800 ఏళ్లుగా కొనసాగుతున్న నిబంధనను ట్రాన్స్ జెండర్ కారణంగా ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మార్చుకోవాల్సి వచ్చింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో డ్రెస్ కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. పురుషులైతే ప్యాంటు, షర్ట్, కోట్ ధరించాల్సిందే. మహిళలైతే స్కర్ట్, జాకెట్ ధరించాలి. పైన కోట్ ధరించవచ్చు. అయితే ఈమధ్యే ట్రాన్స్ జెండర్ చట్టం చేసిన తరువాత పీహెచ్ డీ చేస్తున్న ఓ విద్యార్థి ట్రాన్స్ జెండర్ గా మారాడు. ఇతనితోనే యూనివర్సిటీ నిబంధనకు చిక్కొచ్చిపడింది. మగవాడిగా ప్యాంటు, షర్టు వేసుకుని, యూనివర్సిటీకి వచ్చిన అతగాడు, అమ్మాయిగా మారిన తరువాత అదే డ్రెస్ వేసుకోవాలని భావించాడు. దీనికి యూనివర్సిటీ నిబంధనలు అడ్డం కావడంతో, యాజమాన్యానికి శతవిధాలా తన పరిస్థితి వివరించాడు. వారు నిరాకరించడంతో ఉద్యమానికి సిద్ధమయ్యాడు. చివరకు లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్ ను గౌరవించాలంటూ చేసిన చట్టాలను యూనివర్సిటీ యాజమాన్యానికి వివరించాడు. దీంతో అతని డిమాండ్ కు తలొగ్గిన యూనివర్సిటీ యాజమాన్యం నిబంధనల్లో ఉన్న విధంగా ఎవరైనా డ్రెస్ చేసుకోవచ్చని తెలిపారు. దీంతో అమ్మాయిలు అబ్బాయిల డ్రెస్, అబ్బాయిలు అమ్మాయిల డ్రెస్ వేసుకోవచ్చు.