: కెచప్ బాటిల్ పై కోడ్ స్కాన్ చేస్తే పోర్న్ సైట్ కు తీసుకెళ్లింది!


ఇటీవల కాలంలో ఆయా సంస్థలు తమ ఉత్పత్తులపై క్యూఆర్ కోడ్ (క్విక్ రెస్పాన్స్ కోడ్) ను పొందుపరుస్తున్నాయి. ఆ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా ఉత్పత్తికి సంబంధించిన అదనపు సమాచారం తెలుసుకోవచ్చు. అయితే, జర్మనీలో ఏం జరిగిందో చూడండి. హీంజ్ సంస్థ తయారుచేసిన టమోటా కెచప్ బాటిల్ పై ఉన్న కోడ్ ను స్కాన్ చేసిన ఓ కస్టమర్ నివ్వెరపోయాడు. ఎందుకంటే, ఆ కోడ్ అతడిని ఓ పోర్న్ సైట్ కు తీసుకెళ్లింది. దాంతో, ఆ కస్టమర్ ఫలితాలను హీంజ్ సంస్థ ఫేస్ బుక్ పేజీలో పెట్టాడు. అంతేగాకుండా, ఈ కెచప్ పెద్దవాళ్లకు మాత్రమే అని అర్థం వచ్చేలా "హీంజ్ హాట్ కెచప్ మైనర్లకు కాదు" అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీనిపై స్పందించిన హీంజ్ సంస్థ వెంటనే క్షమాపణలు తెలిపింది. జరిగిన తప్పిదానికి వివరణ ఇచ్చింది. తాము ప్రచారం కోసం ఓ డొమైన్ నేమ్ తో వెబ్ సైట్ ప్రారంభించామని, ఆ ప్రచారం 2014లో ముగిసిందని, అయితే, ఆ తర్వాత సదరు డొమైన్ నేమ్ తో ఉన్న వెబ్ సైట్ ను ఓ పోర్నోగ్రాఫిక్ వెబ్ సైట్ చేజిక్కించుకోవడంతోనే ఈ పొరబాటు జరిగి ఉంటుందని సంస్థ ప్రతినిధి వివరించారు. వస్తువులపై ఉండే క్యూఆర్ కోడ్ ను స్మార్ట్ ఫోన్ తో గానీ, ట్యాబ్ తో గానీ స్కాన్ చేసి అదనపు సమాచారం తెలుసుకోవచ్చన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News