: వేరే ఇంచార్జ్ ని నియమించుకోండి... ఉత్తమ్, జానారెడ్డిలకు ఫోన్ లో చెప్పిన జయసుధ


సినీ నటి, కాంగ్రెస్ నేత జయసుధ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, జయసుధ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, సీనియర్ నేత జానారెడ్డికి ఫోన్ చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి మరో ఇన్ చార్జ్ ను నియమించుకోవాలని సూచించారు. తాను ఇకపై ఇన్ చార్జ్ గా వ్యవహరించలేనని స్పష్టం చేశారు. మున్ముందు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీచేయనని తేల్చి చెప్పారు. జయసుధ అభిప్రాయాలను ఇరువురు నేతలు సావధానంగా విన్నట్టు తెలిసింది. అటు, జయసుధను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారన్న వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని జయసుధ అంటున్నారు. మరి, ఆమె రాజకీయ ప్రస్థానం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి!

  • Loading...

More Telugu News