: అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత శక్తికి నిదర్శనం: సుష్మా స్వరాజ్
జాతి, మతం, రాజకీయాలకు అతీతంగా యోగా దినోత్సవంలో ప్రజలంతా పాల్గొనడం చాలా గొప్ప విషయమని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. ప్రధాని మోదీ ప్రతిపాదన మేరకు జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడం మన దేశ శక్తికి నిదర్శనమని చెప్పారు. న్యూయార్క్ పర్యటనలో ఉన్న ఆమె... ఈ రోజు అక్కడ ఓ హిందూ దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన ఒక గొప్ప బహుమతి యోగా అని ఆమె అన్నారు. నిన్న న్యూయార్క్ లో నిర్వహించిన యోగా డేలో సుష్మ పాల్గొన్నారు.