: జులై 25 నుంచి బోనాల పండుగ
తెలంగాణలో ప్రధానమైన బోనాల పండుగ నెల రోజుల్లో ప్రారంభం కానుంది. మొత్తం మూడు దశల్లో బోనాలు జరగనున్నాయి. మొదట జులై 25 నుంచి గోల్కొండ కోటలో బోనాలు మొదలవుతాయి. ఆగస్టు 2, 3 తేదీల్లో సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, ఆగస్టు 9, 10 తేదీల్లో పాత బస్తీలో బోనాల పండుగ జరగనుంది. ఈ సందర్భంగా అధికారులతో బోనాల ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షించారు. బోనాల పండుగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు.