: ధోనీకి యోగా అవసరం: బిషన్ సింగ్ బేడీ


బంగ్లాదేశ్ చేతిలో వరుస పరాజయాల నేపథ్యంలో, జట్టు మేలు కోసం నాయకత్వం నుంచి తప్పుకునేందుకు తాను సిద్ధమని కెప్టెన్ ధోనీ పేర్కొనడం తెలిసిందే. దీనిపై మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ స్పందించారు. ధోనీ ఇక ఎంతమాత్రమూ కెప్టెన్ కూల్ కాదని అన్నారు. అతనిప్పుడు కష్టకాలంలో ఉన్నాడని, దాన్నుంచి బయటపడేందుకు యోగా అవసరమని సెలవిచ్చారు. "ఈ తరహాలో ధోనీ మాట్లాడడం ఇదే తొలిసారి. అతను ఎంతమాత్రం 'కెప్టెన్ కూల్' కాదనడానికి అదే నిదర్శనం. కలత చెందినట్టుగా కనిపించాడు. మైదానంలోనూ అలాగే దర్శనమిచ్చాడు. తాను శారీరకంగా, మానసికంగా అలసిపోయానని స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. ఈ దశ నుంచి బయటపడాలంటే ధోనీ యోగా కసరత్తులు చేయాల్సిన అవసరం ఉంది" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News