: జర్నలిస్టులకు ఇండియా చాలా డేంజర్


పత్రికా రంగంలో పని చేయాలంటే భారత్ ప్రమాదకరమైన దేశమని ఓ సర్వే వెల్లడించింది. పలుదేశాల్లో పత్రికా రంగం, జర్నలిస్టులపై ఓ వెబ్ సైట్ 'ప్రొటెక్ట్ టు జర్నలిస్ట్' పేరిట సర్వే నిర్వహించి, దాని ఫలితాలు వెల్లడించింది. భారత్ లో అద్భుతమైన స్వేచ్ఛాయుత వాతావరణం ఉంటుందని, అలాగే జర్నలిజం కూడా చాలా శక్తిమంతంగా పని చేస్తుందని ఆ సర్వే తెలిపింది. అదే సమయంలో జర్నలిజంలో విలువలు లేవని, జర్నలిస్టులకు భద్రత లేదని సర్వే పేర్కొంది. గత 22 ఏళ్లలో 55 మంది జర్నలిస్టులు హత్య చేయబడ్డారని ఆ సర్వే తెలిపింది. జర్నలిస్టుల భద్రతకు శక్తిమంతమైన నెట్ వర్క్ లేని కారణంగా, వారు ఎన్నో అరాచకాలు ఎదుర్కోవాల్సి వస్తోందని, కొన్ని సార్లు వాటికి బలికావాల్సి వస్తోందని ఆ సర్వే వెల్లడించింది. అంతే కాకుండా భారత్ లో అత్యధిక జర్నలిస్టులు మారుమూల ప్రాంతాల నుంచే సేవలందిస్తున్నారని, అందువల్ల వారికి శక్తిమంతమైన యంత్రాంగం అవసరమని సర్వే పేర్కొంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా, ఫేస్ బుక్, ట్విట్టర్ కారణంగా జర్నలిస్టులు స్వేచ్ఛగా పని చేయగలుగుతున్నారని ఆ సర్వే తెలిపింది.

  • Loading...

More Telugu News