: రేవంత్ కేసులో మేము ఎవరితోనూ రాజీ పడలేదు: టీఎస్ హోంమంత్రి నాయిని
ఓటుకు నోటు కేసు రెండు రాష్ట్రాలను ఉత్కంఠకు గురి చేసినా, కొన్ని రోజుల నుంచి సైలెంట్ అయిపోయింది. ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వమే ఈ అంశంలో కొంచెం తగ్గిందని కూడా కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో, టీఎస్ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కేసు విషయంలో తాము ఎవరితోనూ లాలూచీ పడలేదని స్పష్టం చేశారు. కేసులో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టమని... ఏసీబీ తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు.