: టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న జయసుధ?


సహజనటి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జయసుధ తన సొంత పార్టీని వీడనున్నారా? త్వరలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారా? దీనికి సమాధానం అవుననే వినిపిస్తోంది. ఇప్పటికే జయసుధ టీఆర్ఎస్ లో చేరడానికి అవసరమైన చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. జయసుధ కుమారుడు శ్రేయాన్ నటించిన 'బస్తీ' సినిమా ఆడియో విడుదల ఫంక్షన్ నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. దీంతో, టీఆర్ఎస్ లోకి జయసుధ చేరుతున్నారన్న వార్తలకు మరింత ఊతం లభించింది. ఈ నేపథ్యంలో, ఈ వార్తలపై జయసుధ స్పందించారు. తనకు ఇంతవరకు టీఆర్ఎస్ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని... ఒకవేళ వస్తే పరిశీలిస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ ఇదే జరిగితే, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తులు కూడా టీఆర్ఎస్ లో కొనసాగే కొత్త ఒరవడి మొదలవుతుంది.

  • Loading...

More Telugu News