: జయసుధను సస్పెండ్ చేసే యోచనలో కాంగ్రెస్
ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జయసుధను పార్టీ నుంచి సస్పెండ్ చేసే యోచనలో ఆ పార్టీ పెద్దలు ఉన్నట్టు సమాచారం. ఈ సాయంత్రం సీనియర్ నేత జానారెడ్డి నివాసంలో టీకాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి మరో ఇన్ ఛార్జ్ ను నియమించే అంశంపై వారు చర్చించనున్నారు. కొంతకాలంగా జయసుధ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కుంటుపడే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. మరోవైపు, జయసుధ టీఆర్ఎస్ లో చేరనుందనే వార్తలను కూడా కాంగ్రెస్ పెద్దలు సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం. దీంతో, జయసుధను సస్పెండ్ చేసే యోచనలో పీసీసీ ఉంది.