: బొబ్బిలి రాజులతో విజయసాయి మంతనాలు...రాయబారం ఫలించలేదని గుసగుసలు


ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా పనిచేసి ఇటీవలే వైసీపీలో చేరిన బొత్స సత్యనారాయణ వ్యవహారంపై ఆయన సొంత జిల్లాకు చెందిన బొబ్బిలిరాజులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నిత్యం తమకు అడ్డుపడుతూ వచ్చిన బొత్స సత్తిబాబును పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ బొబ్బిలి సోదరులు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నిలదీశారని కూడా వార్తలొచ్చాయి. అయినా ఇవేమీ చెవికెక్కించుకోని జగన్, బొత్సకు కండువా కప్పేశారు. ఇక లాభం లేదనుకున్న బొబ్బిలిరాజులు పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నిన్న ఉదయం బొబ్బిలిరాజులతో దాదాపు నాలుగు గంటల పాటు భేటీ అయ్యారు. పార్టీ మారొద్దని ఆయన వారికి నచ్చజెప్పారట. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని విశ్వసనీయ సమాచారం. నాలుగు గంటల పాటు అన్ని మార్గాల్లో యత్నించిన సాయిరెడ్డి ఫలితం రాబట్టకుండానే వెనుదిరిగారట. ఇదిలా ఉంటే, పార్టీ మారాలన్న తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని బొబ్బిలి రాజులు తమ సన్నిహితుల వద్ద చెబుతున్నారట.

  • Loading...

More Telugu News