: కాబూల్ లో రణరంగం... ఆఫ్ఘాన్ బలగాల ప్రతిదాడిలో ఇద్దరు ఉగ్రవాదుల హతం


ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. పార్లమెంట్ భవనంపై మెరుపుదాడికి దిగిన తాలిబాన్లు ఆరుగురిని పొట్టనబెట్టుకున్నారు. ఆ తర్వాత క్షణాల్లో అప్రమత్తమైన ఆఫ్ఘన్ బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. ఆఫ్ఘాన్ బలగాలు జరిపిన ప్రతిదాడిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరింత మంది ఉగ్రవాదులు పార్లమెంట్ భవన సముదాయంలో ఉన్నట్లు సమాచారం. దీంతో పార్లమెంట్ ఆవరణలో పోలీసులు అడుగడుగునా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News