: ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటు భవనంపై తాలిబన్ల ఆత్మాహుతి దాడి


ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో పార్లమెంట్ భవనంపై తీవ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. వరుసగా ఆరుసార్లు భారీ పేలుళ్లు సంభవించినట్టు అధికారులు వెల్లడించారు. అనంతరం భవనం బయట ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్టు చెప్పారు. దీంతో ఘటనాస్థలం వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించినట్టు తెలిసింది. అకస్మాత్తుగా చోటుచేసుకున్న పేలుళ్లతో కాబూల్ దద్దరిల్లింది. ఈ దాడికి పాల్పడింది తామేనని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News