: కిడ్నీలో రాళ్లు తీయమంటే...రెండు కిడ్నీలకు ఆపరేషన్ చేసి రోగిని చంపేసిన వైద్యులు
ఒక్కోసారి వైద్యుల నిర్లక్ష్యం రోగుల ప్రాణాలు తీస్తుంది. తాజాగా హైదరాబాదులో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. చాదర్ ఘాట్ పరిధిలో కార్యకలాపాలు సాగిస్తున్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ తరహా నిర్లక్ష్య వైద్యానికి ఓ వ్యక్తి బలైపోయాడు. కిడ్నీలో రాళ్లతో నానా అవస్థలు పడ్డ ఓ వ్యక్తి సదరు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చాడు. ఆపరేషన్ చేస్తే సరిపోతుందని చెప్పిన ఆ ఆస్పత్రి వైద్యులు చికిత్స నిమిత్తం బాధితుడి వద్ద దాదాపు రూ.4 లక్షలు వసూలు చేశారు. తీరా ఆపరేషన్ థియేటర్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, అసలు రోగం మరిచి రెండు కిడ్నీలకు ఆపరేషన్ చేసేశారు. దీంతో రోగి మృత్యువాతపడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితుడి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.