: కృష్ణా జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా... 20 మంది చిన్నారులకు గాయాలు


కృష్ణా జిల్లాలో కొద్దిసేపటి క్రితం ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. జిల్లాలోని నందివాడ మండలం పుట్టగంట సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఉదయం పిల్లలను పాఠశాలకు తీసుకెళుతున్న బస్సు పుట్టగుంట వద్ద ఒక్కసారిగా బోల్తా పడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 58 మంది విద్యార్థులున్నారు.

  • Loading...

More Telugu News