: బెల్జియం బయలుదేరిన కల్వకుంట్ల కవిత... 26 వరకు బ్రస్సెల్స్ లో పర్యటన
నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి క్రితం బెల్జియం పర్యటనకు బయలుదేరివెళ్లారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నేతృత్వంలో బెల్జియం బయలుదేరిన భారత పార్లమెంటరీ బృందంలో కవిత కూడా ఉన్నారు. పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించి అక్కడ జరుగుతున్న సమావేశాల్లో పాల్గొనేందుకు ఈ బృందం వెళుతోంది. ఈ నెల 26 వరకు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో వీరు పర్యటించనున్నారు. అక్కడ జరిగే పలు సభలు, సమావేశాలు, చర్చాగోష్ఠి లలో పాలుపంచుకుంటారు.