: ‘అచ్చ తెలుగు’ పోచారం... రూటు మార్చారు!
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి... అచ్చ తెలుగుదనానికి ప్రతీక. పంచెకట్టుతో ఆయన నిండైన రూపం ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ ఆయన పంచెకట్టుతోనే ఆకట్టుకునేవారు. తాజాగా నిన్న టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ కు వచ్చిన పోచారంను చూసిన కేసీఆర్ ముసిముసిగా నవ్వగా, అక్కడి వారంతా నోరెళ్లబెట్టారట. అసలు విషయమేంటంటే, నిత్యం పంచెకట్టులో కనిపించే పోచారం నిన్న ప్యాంట్ ధరించారు. అది కూడా మామూలు ప్యాంట్ కాదు, బ్లూ కలర్ జీన్ ప్యాంట్ ధరించి వచ్చారు. దానిపైన గులాబీ రంగు షర్టేసుకున్న పోచారం కొత్త అవతారంలో కనిపించారు.