: ఫోనొస్తే... బెంబేలెత్తిపోతున్న టీఆర్ఎస్ ముఖ్య నేతలు!


ఓటుకు నోటు కేసుతో వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్... తాజాగా టీఆర్ఎస్ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఫోన్ మోగిందంటే చాలు, ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు బెంబేలెత్తిపోతున్నారు. నిన్నటిదాకా సెల్ ఫోన్లను విరివిగా వినియోగించిన సదరు నేతలు, ప్రస్తుతం ఫోన్ వస్తే ముందుగా తమ పీఏలు మాట్లాడిన తర్వాతే సదరు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారట. అంతేకాక 'ఫోన్ లో ఏం మాట్లాడతాం, కలిసినప్పుడు మాట్లాడుకుందాంలే' అంటూ పొడిపొడిగా మాట్లాడి కాల్ కట్ చేస్తున్నారట. టీడీపీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కారు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందన్న వార్తల నేపథ్యంలో తమ ఫోన్లపైనా అధినాయకత్వం నిఘా వేసిందన్న పుకార్లు టీఆర్ఎస్ నేతల మధ్య చక్కర్లు కొడుతున్నాయి. ఈ కారణంగానే ఆ పార్టీ కీలక నేతలు ఫోన్ లో మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదట. కాస్త తెలిసిన నెంబర్ల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ ను ముందు సహాయకుల చేత లిఫ్ట్ చేయిస్తున్న నేతాశ్రీలు, తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను చూస్తేనే భయపడిపోతున్నారట.

  • Loading...

More Telugu News