: నాయకత్వం కావాలని నేనెప్పుడూ కోరలేదు...సంతోషంగా తప్పుకుంటా: ధోనీ సంచలన వ్యాఖ్య


టీమిండియా జట్టు సారధుల్లో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీది ప్రత్యేకమైన స్థానమే. జట్టును విజయాల బాట పట్టించడంతో పాటు రెండోసారి వన్డే వరల్డ్ కప్ నే కాక టీ20 తొలి వరల్డ్ కప్ ను కూడా అతడు సాధించిపెట్టాడు. టెస్టు ర్యాంకింగ్స్ లో జట్టును నెంబర్ వన్ స్థానంలో కూర్చోబెట్టాడు. అయితే ఇటీవల అతడి సారధ్యంలో టీమిండియా పరాజయాలు చవిచూస్తోంది. ఇప్పటికే టెస్టుల నుంచి రిటైర్ మెంట్ ప్రకటించిన ధోనీ నిన్న సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టుకు నాయకత్వం వహిస్తానని తానెప్పుడూ కోరలేదని చెప్పిన అతడు, ఎప్పుడైనా సారధ్య బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే, భారత్ కు ఏమాత్రం మేలు జరుగుతుందని భావించినా సంతోషంగా తప్పుకుంటానని అతడు పేర్కొన్నాడు. జట్టుకు కించిత్ నష్టం జరిగినా... తన వైపే వేలెత్తి చూపుతున్నారని అతడు వాపోయాడు. నాయకత్వం కావాలని తానెప్పుడూ కోరలేదని, ఎవరి సారధ్యంలోనైనా ఆటగాడిగా కొనసాగడానికి రెడీగా ఉన్నానని ధోనీ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News