: 'బస్తీ' ఆడియో సీడీ ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు 'బస్తీ' సినిమా ఆడియో ఆవిష్కరణకు హాజరయ్యారు. కేసీఆర్ రాకతో శిల్పకళావేదిక హోరెత్తిపోయింది. ఆయన ఈ సినిమా ఆడియో సీడీని ఆవిష్కరించారు. తొలి సీడీని దాసరి నారాయణరావుకు అందించారు. కాగా, ఈ సినిమాలో జయసుధ తనయుడు శ్రేయాన్ సరసన ప్రగతి చౌరాసియా హీరోయిన్ గా నటించింది. వాసు మంతెన దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రవీణ్ ఇమ్మడి సంగీతం అందించారు. కాగా, ఈ ఆడియో ఫంక్షన్ కు మోహన్ బాబు, రాఘవేంద్రరావు, మురళీమోహన్, టి.సుబ్బరామిరెడ్డి, విజయనిర్మల తదితరులు హాజరయ్యారు.