: లంచం తీసుకోవడమూ నేరమే... స్టీఫెన్ సన్ ను అరెస్టు చేయాలి: భట్టి


తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క హైదరాబాదు గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఎంత తప్పో, తీసుకోవడం కూడా అంతే తప్పని అన్నారు. ఇక, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హితవు పలికారు. ఇద్దరు చంద్రులు పాలన పక్కనబెట్టి, ప్రజలను వంచిస్తున్నారని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News