: ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ పిచ్చి వేషాలు!
ఆటకు స్వస్తి చెప్పిన ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ ప్లేబోయ్ అవతారమెత్తాడు. భార్యకు విడాకులిచ్చిన వార్న్ హాలీవుడ్ నటి ఎలిజబెత్ హర్లీతో రెండేళ్లు ప్రేమాయణం నడిపాడు. పీకల్లోతు ప్రేమలో ఉండగా, వార్న్ మరో అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడన్న విషయం తెలిసి ఎలిజబెత్ వదిలేసింది. అప్పటికీ వార్న్ కు బుద్ధి రాలేదు. ఈసారి ఏకంగా డేటింగ్ వెబ్ సైట్ లో తన డీటెయిల్స్ పోస్టు చేశాడట. 'టిండర్' అనే డేటింగ్ అప్లికేషన్ లో తన డీటెయిల్స్ చూసిన అమ్మాయిలు ఆసీస్ బౌలర్ షేన్ వార్నేనా? అని ముఖం మీదే అడిగేస్తున్నారట. వార్న్ ని నమ్మడం లేదట. ఈ విషయం వార్నే చెప్పాడు. ఈ అప్లికేషన్ ద్వారా ఇద్దరితో డేటింగ్ కూడా చేశాడట. షేన్ వార్న్ పిల్లల్లో పెద్దమ్మాయికి 18 ఏళ్లు కావడం విశేషం. దీంతో షేన్ వార్న్ కు అమ్మాయిలపిచ్చి పట్టుకుందని వ్యాఖ్యలు వినబడుతున్నాయి. పాశ్చాత్యదేశాల్లో ఇవన్నీ మామూలేనని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.