: యోగాపై పాక్ తన తీరు మార్చుకోవాలి: రవిశంకర్ ప్రసాద్


యోగాపై పాకిస్థాన్ తన తీరు మార్చుకోవాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సలహా ఇచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని 190 దేశాలు యోగాకు మద్దతు పలికాయన్న విషయం పాక్ గుర్తించాలని అన్నారు. ఈ 190 దేశాల్లో 44 ముస్లిం దేశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. యోగా అనేది మతం కాదని, జీవన విధానమని ఆయన పాక్ కు హితవు పలికారు. యోగాకు కులమతాలు, దేశాలు అంటూ సరిహద్దులు విధించవద్దని ఆయన పాక్ కు సూచించారు. యోగా ద్వారా మంచి జీవన విధానం అలవడుతుందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News