: ఆమె పినతల్లి కాదు పిశాచి


డబ్బు మా చెడ్డది...ఎంత వారినైనా దిగజారుస్తుందని ఓ సినీ కవి చెప్పినట్టు, డబ్బు మోజులో పినతల్లి కుమార్తె లాంటి యువతిని వ్యభిచార కూపంలోకి దింపింది. ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర్లోని వేటపాలెంకి చెందిన ఓ యువతి తల్లిని కోల్పోయింది. తండ్రి పట్టించుకోకపోవడంతో నానమ్మ దగ్గరే ఉంటోంది. ఈ నేపథ్యంలో అక్క కుమార్తెపై కన్నేసిన పినతల్లి జ్యోతి తనకు ఆరోగ్యం బాగాలేదని యువతికి ఫోన్ చేసింది. పినతల్లిని చూసేందుకు ఆమె నెల్లూరు జిల్లా అల్లూరు చేరుకుంది. దీనిని అవకాశంగా తీసుకున్న జ్యోతి, యువతిని నిర్బంధించి, వ్యభిచార కూపంలోకి నెట్టి, డబ్బు సంపాదించడం మొదలు పెట్టింది. చిన్నమ్మను చూసి వస్తానని వెళ్లిన యువతి, 17 రోజులు గడిచినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన నాయనమ్మ జ్యోతికి ఫోన్ చేయడం మొదలు పెట్టింది. పనిలో ఉందని, తరువాత చేయమని పదేపదే జవాబు వినిపిస్తుండడంతో అనుమానం వచ్చిన యువతి నాయనమ్మ, గట్టిగా నిలదీయడంతో యువతిని వేటపాలెం ఎప్పుడో పంపించేశానని, తన దగ్గర లేదని జ్యోతి చిరాగ్గా సమాధానమిచ్చింది. దీంతో కీడు శంకించిన యువతి నాయనమ్మ నేరుగా ఒంగోలు చేరుకుని బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ)కి ఫిర్యాదు చేసింది. చైల్డ్ లైన్ ప్రతినిధులు సీఐని కలవడంతో ఒంగోలు ప్రాంతానికి చెందిన ఎస్సై చల్లా వాసుకు ఈ కేసును అప్పగించారు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వాసు, జ్యోతి గుట్టురట్టుచేసి యువతికి వ్యభిచారకూపం నుంచి విముక్తి కల్పించారు. జ్యోతితో పాటు, నిర్మలాదేవి అనే మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News