: 'ఆయన విలన్ కాదు, హీరో' అంటున్న సోనాక్షి


బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అకీరా' సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'అకీరా' సినిమాలో అనురాగ్ కశ్యప్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ లో భాగంగా కిందపడిన ఆయన గాయపడ్డారు. అయినప్పటికీ షూటింగ్ కు ఎలాంటి అంతరాయం కలుగకుండా షూటింగ్ లో పాల్గొని, హీరో అయ్యారని సోనాక్షి ట్విట్టర్ లో పేర్కొంది. కాగా, ఈ మధ్య కాలంలో షూటింగ్ లో నటీనటులు గాయపడడం సాధారణమైంది. తమిళ అగ్ర నటుడు అజిత్ షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లెక్కలేనన్ని సార్లు షూటింగ్ సందర్భంగా గాయపడ్డాడు. కాగా, 'అకీరా' సినిమాలో సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా, కొంకణా సేన్ తదితరులు నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News