: మీడియాపై అలిగిన రక్షణ మంత్రి...6 నెలలు మీడియాకు దూరం?


చేసిన ప్రతి వ్యాఖ్య వివాదం అవుతుండడంతో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మీడియాపై అలకబూనారు. ఆరు నెలల పాటు మీడియాతో మాట్లాడనని పేర్కొన్నారు. గోవా పర్యటనలో ఉన్న కేంద్ర రక్షణ మంత్రి పారికర్ మూడు రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చారు. వస్తూనే మరో ఆరు నెలలపాటు మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఈ మధ్యకాలంలో తానేం మాట్లాడినా మీడియా వివాదం చేస్తోందని ఆయన కినుక వహించినట్టు తెలుస్తోంది. మయన్మార్ లోకి చొరబడి భారత సైన్యం ఉగ్రవాదులను మట్టుబెట్టిన సందర్భంగా, పాక్ ను దృష్టిలో పెట్టుకుని ఎక్కడికైనా భారత సైన్యం ఇలాగే వెళ్తుందని ఆయన పేర్కొన్నప్పుడు వివాదం రేగింది. తరువాత దేశ సరిహద్దుల్లో దాక్కున్న ఉగ్రవాదులపై డ్రోన్ దాడులు చేస్తామని ఆయన చెప్పడం మరో వివాదానికి ఆజ్యం పోసింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఉగ్రవాదులను ఉగ్రవాదులతోనే మట్టుబెట్టాలని ఆయన వ్యాఖ్యానించడం కూడా వివాదం రేపింది. దీంతో తానేం మాట్లాడినా వివాదం రేగుతోందని భావించిన ఆయన మీడియాకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. మరో ఆరు నెలల పాటు మీడియాతో మాట్లాడనంటున్నారు. సాధ్యమేనంటారా?

  • Loading...

More Telugu News