: 'గ్లాడియేటర్' ఆధారంగా విజయ్ 'పులి'!


హాలీవుడ్ లో సూపర్ హిట్టైన 'గ్లాడియేటర్' సినిమా స్పూర్తితో తమిళంలో విజయ్ తో 'పులి' సినిమాను నిర్మిస్తున్నామని నిర్మాత శిబు థామ్సన్ తెలిపారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, 'పులి' కథ చెప్పగానే ప్రముఖ నటి శ్రీదేవి నటించేందుకు అంగీకరించారని అన్నారు. దక్షిణాదిలో శ్రీదేవి నటించాలని అభిమానులు కోరుకుంటున్నారని, తమ సినిమా ద్వారా ఆమె దక్షిణాది సినిమాల్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, సెకెండ్ ఇన్సింగ్స్ లో 'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమాలో శ్రీదేవి నటించినప్పటికీ అది హిందీ సినిమా కావడం విశేషం. కాగా, 'పులి' సినిమాలో విజయ్ సరసన హన్సిక, శృతిహాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'ఈగ' ఫేం సుదీప్ కీలకపాత్ర పోషిస్తున్నారు. చింబు దేవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News