: కట్టుకున్న భార్యను కడతేర్చిన కానిస్టేబుల్
కానిస్టేబుల్ గా బాధ్యతాయుతమైన ఉద్యోగంలో వున్న ఓ వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. హైదరాబాదులోని యూసుఫ్ గూడ పోలీస్ లైన్స్ లో ఉంటున్న నర్సిరెడ్డి అనే కానిస్టేబుల్ తన భార్యను హత్య చేశాడు. కుటుంబ కలహాలే ఈ ఘాతుకానికి కారణమని సమాచారం. హత్య చేసిన వెంటనే నర్సిరెడ్డి పరారయ్యాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.