: గవర్నర్ పై వ్యాఖ్యలను సమర్థించిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ను గంగిరెద్దు అనడంలో తప్పులేదని అన్నారు. ఏపీ ప్రజల ఆదాయం నుంచి జీతం తీసుకుంటూ వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తిరుమలకు తరచూ వస్తూ భక్తులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. బయో డీజిల్, మేఘమథనంలో రూ.1,500 కోట్ల అవినీతికి పాల్పడిన రఘువీరారెడ్డి వెళ్లి, మామిడి పళ్లు ఇవ్వగానే 'అహో... ఒహో...' అని మెచ్చుకుంటున్నారని, అలాంటప్పుడు గవర్నర్ ను ఇంకేమనాలని గాలి ప్రశ్నించారు. గవర్నర్ పై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు, ఆరోపణలు చేయవద్దని ఏపీ మంత్రులు, పార్టీ నేతలను సీఎం చంద్రబాబు ఆదేశించినప్పటికీ గాలి ఇలా మాట్లాడటం గమనార్హం.