: 'టీ న్యూస్'కి నోటీసులిస్తే...టీఆర్ఎస్ నేతలు గొంతు చించుకుంటున్నారు: ఎర్రబెల్లి
'టీ న్యూస్'కి నోటీసులిస్తే టీఆర్ఎస్ నేతలంతా గొంతు చించుకుంటున్నారని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 'టీ న్యూస్'కు నోటీసులిస్తేనే పత్రికా స్వేచ్ఛ అంటూ గొంతు చించుకుంటున్న టీఆర్ఎస్ నేతలకు ఆంధ్రజ్యోతి ఏబీఎన్ ఛానెల్ పై అనధికార నిషేధం కనబడడం లేదా? అని ప్రశ్నించారు. మరి దానిపై ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశారు. టీన్యూస్ ను వివరణ కోరుతూ నోటీసులిచ్చారని, సరైన వివరణ ఇస్తే సరిపోయే దానికి లేనిపోని రాద్ధాంతం చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. టీన్యూస్ విశాఖ పోలీసులకు సరైన వివరణ ఇస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.