: ఇద్దరు వ్యక్తుల సంభాషణను ఎక్కడో ఉన్నవారు వింటున్నారు... ఫోన్ ట్యాపింగ్ పై గవర్నర్ కీలక వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టిన ఫోన్ ట్యాపింగ్ పై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఫోన్ లో కొనసాగుతున్న సంభాషణను ఎక్కడో వేల మైళ్ల దూరంలోని వ్యక్తులు వింటున్నారని కొద్దిసేపటి క్రితం ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాదులో ఉన్న మిటిటరీ ఇంజినీరింగ్ కాలేజ్ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ విభాగానికి సంబంధించిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ప్రసంగించిన గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించారు. ఇలాంటి విపరిణామాలకు చెక్ పడాలంటే ట్యాపింగ్ లేని సెల్ ఫోన్ వ్యవస్థ రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించేలా సాంకేతిక పరిజ్ఞానం ఉండాలని కూడా ఆయన అన్నారు.