: చంద్రబాబుపై తెలంగాణ జేఏసీ న్యాయవాదుల ఫిర్యాదు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ జేఏసీ న్యాయవాదులు హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాబుపై కేసు నమోదు చేయాలని టీ.న్యాయవాదులు గోవర్థన్ రెడ్డి, ఉపేంద్రలు పోలీసులకు ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు. 'ఓటుకు నోటు' వ్యవహారంలో 'టీ న్యూస్' చానల్ కు ఏపీ పోలీసులు నోటీసు ఇవ్వడాన్ని నిరసిస్తూ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.