: కరెంటు పొయ్యిలో కేజీ బంగారం... శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టివేత


విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారంపై పన్ను ఎగవేతకు అక్రమార్కులు రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. శరీర భాగాల్లోనే కాక సెల్ ఫోన్లు, ఇతర ఖరీదైన వస్తువుల్లో బంగారాన్ని దాచేసి దేశంలోకి తరలిస్తున్న వైనాన్ని హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు ఎప్పటికప్పుడు ఛేదిస్తూనే ఉన్నారు. తాజాగా నేటి ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో శంషాబాదు చేరుకున్న ఓ ప్రయాణికుడిని తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు నిందితుడిని ముంబైకి చెందిన ఇమ్రాన్ గా గుర్తించారు. నిఘా కళ్లుగప్పి ఎలక్ట్రిక్ పొయ్యిలో బంగారాన్ని దాచిన అతడి వినూత్న చర్యను చూసి కస్టమ్స్ అధికారులు నోరెళ్లబెట్టారు.

  • Loading...

More Telugu News